గృహ హింస చట్టం
పోలీసు : "గృహ హింస చట్టం కింద మీ ఆవిడ మీద కేసు పెడుతున్నావ్ సరే , యింతకీ ఏమి చేసింది ఏమిటి?"
ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు
పోలీసు : "గృహ హింస చట్టం కింద మీ ఆవిడ మీద కేసు పెడుతున్నావ్ సరే , యింతకీ ఏమి చేసింది ఏమిటి?"
అనగనగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు....రోజూ తిని, పని చేసి, తొంగుంటే మడిసి కి గొడ్డు కి తేడా ఉండదు అనుకుని వీలు చిక్కించుకుని అలా సరదాగా యాత్రలకు వెళ్లి వస్తుంటాడు. అలా వెళితే సమస్య ఉండదు కానీ వెధవది లైఫ్ లో ఏ పని చేసినా కాస్త కిక్ ఉండాలని అంటూ ఉంటాడు. ఒకసారి అలానే ఒక విహార యాత్ర చేస్తాడు. అది కాస్తా బెడిసి కొట్టి సాహస యాత్ర గా ఎలా మారిందో ........చూడండి
Read more...అలారం మోగడం తో వుల్లిక్కి పడి లేచాను, టైము చూస్తే ఆరు అయ్యింది . వాటిన్ట్లోంచి అమ్మ " ఇంకా లేవరా నాన్న , ఆరు అయ్యింది , హోము వరకు చేసి ,స్కూలు కి వెళ్ళాలి" అంది. చలి కాలం కావడం తో దుప్పటి పైకి లాగి కప్పుకొని " అమ్మా ఫ్యాన్ కట్టూ ..." అని అరిచాను . వంటింట్లో పూజ చేసుకుంటున్న అమ్మ , ఏదో మంత్రాలు చదువుతూ నా గది లోకి వచ్చి " అబ్బా లేవరా , కావలిసి వస్తే రాత్రికి త్వరగా పడుకొందు గానివి లే " అంటూ దగ్గరికి వచ్చి చేయి పెట్టి తట్టి లేపటం మొదలు పెట్టింది . "అబ్బా ....." అంటూ కళ్ళు నలుపుకుంటూ లేచి చూసే సరికి పక్కనే భార్యా మణి గారు " మ్ మ్ ....లేవండి ...లేచి జాగింగ్ కి వెళ్ళండి , వెళ్లి ఆ బొజ్జ తగ్గించండి... అంటూ..శుభోదయం పలక గా " మళ్లీ వస్తాయా ఆ చిన్ననాటి రోజులు" అనుకొంటూ బాత్ రూము వైపు నడిచాను.
Read more...