ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు

Tuesday, April 7, 2009

వర్కింగ్ ఫ్రం హోం


ఈమధ్య ఐటీ కంపెనీల లో పని చేసే వాళ్ళు వొంట్లో బాగాలేనప్పుడు లేక బద్ధకం వేసినప్పుడు వాళ్ళ బాస్ కి

ఫోను చేసి "సర్, నాకు వొంట్లో బాగాలేదు నీను ఇవ్వాళా ఇంట్లోంచి పనిచేస్తాను" లేక "సర్, నాకు ఒక

ఇమ్పోర్తంట్ పని వుంది కాబట్టి నేను ఇవ్వాళా ఇంట్లోంచి పనిచేస్తాను" అని అంటూంటారు. అది గమనించిన

మా పకింటి అబ్బాయి వాళ్ళ అమ్మతో ఒక క్రికెట్ మ్యాచ్ వస్తున్న రోజు ఇలాన్నాడు "అమ్మ నేను ఇవ్వాళా

వర్కింగ్ ఫ్రొం హొమ్వ్, స్కూలుకి వెళ్ళటం లేదు" అని అన్నాడు. అది విన్న వాళ్ళ అమ్మ " ఏరా వెధవ, ఏం

మట్లడుతునావ్ నువ్వు, నోరుమూసుకొని స్కూలుకి వెళ్ళు" అని అంది. అప్పుడు ఆ అబ్బాయి అదేంటమ్మా

నాన్న అలాగా అంటే నువ్వు ఏమి అన్నావు కానీ నన్ను ఎందుకు తిడుతున్నావ్" అన్నాడు. అది విని

వాళ్ళ అమ్మకి నోట్లోంచి మాట రాలేదు. ఇది ఈనాటి పిల్లల సంగతి.మీరేమంటారు ???


0 నసుగులు: