ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు

Wednesday, April 8, 2009

రిసెషన్ లో ఐటి వాడి జీవిత గాధ

ఒక్కోసారి అనిపిస్తుంది జీవితం ఎంతమరిపోయిందో నని. ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ లో

చదువుతున్నపుడు స్పెషల్ క్లాస్సులు వున్నపుడు నాన్నగారు ఎంత రాత్రి అయిన నాకోసం కాలేజీ బయట

వెయిట్ చేసేవారు. నన్ను పిక్ అప్ చేసుకొని ఇంటికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు నా జీవితం పూర్తిగా

మారిపొయింది. అమెరికా లో రిసెషన్ పుణ్యమా అని నాప్రాణానికి వున్నా ఉద్యోగం పోయి రోడ్డు మీద

పడ్డాను. ఎక్కడ చూసిన ఉద్యోగాలకి పెద్ద క్యూఁ. ఆ క్యూఁ లో ఎంత రాత్రి అయిన నిల్చుని ఆ హెచ్. ఆర్. ని

కలిసి వాడి ఏడుపుగొట్టు మొహం చూసి, ఇవ్వాళా కూడా ఉద్యోగం రాలేదు అని విని ఇంటికి వచేసరికి అన్నం

పెట్టటానికి రూములో అమ్మ కూడా వుండదు. ఒక్కపుడు నాన్నగారు నాకోసం వైటు చేసేవారు, ఇప్పుడు

నేను ఉద్యోగం కోసం వైటు చేస్తున్నాను. ఏమిటో!!!!.

0 నసుగులు: