ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు

Monday, April 6, 2009

ఆ చిన్ననాటి రోజులు

అలారం మోగడం తో వుల్లిక్కి పడి లేచాను, టైము చూస్తే ఆరు అయ్యింది . వాటిన్ట్లోంచి అమ్మ " ఇంకా లేవరా నాన్న , ఆరు అయ్యింది , హోము వరకు చేసి ,స్కూలు కి వెళ్ళాలి" అంది. చలి కాలం కావడం తో దుప్పటి పైకి లాగి కప్పుకొని " అమ్మా ఫ్యాన్ కట్టూ ..." అని అరిచాను . వంటింట్లో పూజ చేసుకుంటున్న అమ్మ , ఏదో మంత్రాలు చదువుతూ నా గది లోకి వచ్చి " అబ్బా లేవరా , కావలిసి వస్తే రాత్రికి త్వరగా పడుకొందు గానివి లే " అంటూ దగ్గరికి వచ్చి చేయి పెట్టి తట్టి లేపటం మొదలు పెట్టింది . "అబ్బా ....." అంటూ కళ్ళు నలుపుకుంటూ లేచి చూసే సరికి పక్కనే భార్యా మణి గారు " మ్ మ్ ....లేవండి ...లేచి జాగింగ్ కి వెళ్ళండి , వెళ్లి ఆ బొజ్జ తగ్గించండి... అంటూ..శుభోదయం పలక గా " మళ్లీ వస్తాయా ఆ చిన్ననాటి రోజులు" అనుకొంటూ బాత్ రూము వైపు నడిచాను.

0 నసుగులు: