ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు
Wednesday, April 29, 2009
Tuesday, April 21, 2009
Friday, April 10, 2009
బ్లాంతరంగం
ఆంగ్లం లోనే కాదు తెలుగు లో కుడా వెలగ పెట్టచు అని. సరే అని ఏదో జీ మెయిల్ లో వున్నా తెలుగు
టైపింగ్ వుపయోగించి టైపు చేయడం మొదలు పెట్టాం. పర్లేదు బానే వచ్చింది అనిపించి ఈ బ్లాగు మొదలు
పెట్టాం . ఇక చూడాలి ఎన్ని రోజులు ఏది సాగుతుందో .
దీనితో పాటు నేను ఇంకో రెండు బ్లాగులు మేనేజ్ చేస్తాను.కావాలంటే అవి కూడా ఎంజాయ్ చేయండి
1) Life2oons
2) Adding Karma to Confusion
బ్లాంతరంగం : అంటే బ్లాగరుల యొక్క అంతరంగం
Wednesday, April 8, 2009
రిసెషన్ లో ఐటి వాడి జీవిత గాధ
చదువుతున్నపుడు స్పెషల్ క్లాస్సులు వున్నపుడు నాన్నగారు ఎంత రాత్రి అయిన నాకోసం కాలేజీ బయట
వెయిట్ చేసేవారు. నన్ను పిక్ అప్ చేసుకొని ఇంటికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు నా జీవితం పూర్తిగా
మారిపొయింది. అమెరికా లో రిసెషన్ పుణ్యమా అని నాప్రాణానికి వున్నా ఉద్యోగం పోయి రోడ్డు మీద
పడ్డాను. ఎక్కడ చూసిన ఉద్యోగాలకి పెద్ద క్యూఁ. ఆ క్యూఁ లో ఎంత రాత్రి అయిన నిల్చుని ఆ హెచ్. ఆర్. ని
కలిసి వాడి ఏడుపుగొట్టు మొహం చూసి, ఇవ్వాళా కూడా ఉద్యోగం రాలేదు అని విని ఇంటికి వచేసరికి అన్నం
పెట్టటానికి రూములో అమ్మ కూడా వుండదు. ఒక్కపుడు నాన్నగారు నాకోసం వైటు చేసేవారు, ఇప్పుడు
నేను ఉద్యోగం కోసం వైటు చేస్తున్నాను. ఏమిటో!!!!.
Tuesday, April 7, 2009
వర్కింగ్ ఫ్రం హోం
ఫోను చేసి "సర్, నాకు వొంట్లో బాగాలేదు నీను ఇవ్వాళా ఇంట్లోంచి పనిచేస్తాను" లేక "సర్, నాకు ఒక
ఇమ్పోర్తంట్ పని వుంది కాబట్టి నేను ఇవ్వాళా ఇంట్లోంచి పనిచేస్తాను" అని అంటూంటారు. అది గమనించిన
మా పకింటి అబ్బాయి వాళ్ళ అమ్మతో ఒక క్రికెట్ మ్యాచ్ వస్తున్న రోజు ఇలాన్నాడు "అమ్మ నేను ఇవ్వాళా
వర్కింగ్ ఫ్రొం హొమ్వ్, స్కూలుకి వెళ్ళటం లేదు" అని అన్నాడు. అది విన్న వాళ్ళ అమ్మ " ఏరా వెధవ, ఏం
మట్లడుతునావ్ నువ్వు, నోరుమూసుకొని స్కూలుకి వెళ్ళు" అని అంది. అప్పుడు ఆ అబ్బాయి అదేంటమ్మా
నాన్న అలాగా అంటే నువ్వు ఏమి అన్నావు కానీ నన్ను ఎందుకు తిడుతున్నావ్" అన్నాడు. అది విని
వాళ్ళ అమ్మకి నోట్లోంచి మాట రాలేదు. ఇది ఈనాటి పిల్లల సంగతి.మీరేమంటారు ???
Monday, April 6, 2009
ఆ చిన్ననాటి రోజులు
అలారం మోగడం తో వుల్లిక్కి పడి లేచాను, టైము చూస్తే ఆరు అయ్యింది . వాటిన్ట్లోంచి అమ్మ " ఇంకా లేవరా నాన్న , ఆరు అయ్యింది , హోము వరకు చేసి ,స్కూలు కి వెళ్ళాలి" అంది. చలి కాలం కావడం తో దుప్పటి పైకి లాగి కప్పుకొని " అమ్మా ఫ్యాన్ కట్టూ ..." అని అరిచాను . వంటింట్లో పూజ చేసుకుంటున్న అమ్మ , ఏదో మంత్రాలు చదువుతూ నా గది లోకి వచ్చి " అబ్బా లేవరా , కావలిసి వస్తే రాత్రికి త్వరగా పడుకొందు గానివి లే " అంటూ దగ్గరికి వచ్చి చేయి పెట్టి తట్టి లేపటం మొదలు పెట్టింది . "అబ్బా ....." అంటూ కళ్ళు నలుపుకుంటూ లేచి చూసే సరికి పక్కనే భార్యా మణి గారు " మ్ మ్ ....లేవండి ...లేచి జాగింగ్ కి వెళ్ళండి , వెళ్లి ఆ బొజ్జ తగ్గించండి... అంటూ..శుభోదయం పలక గా " మళ్లీ వస్తాయా ఆ చిన్ననాటి రోజులు" అనుకొంటూ బాత్ రూము వైపు నడిచాను.
Read more...